News May 10, 2024
ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి హెచ్చరిక

ఫాస్ట్‌ఫుడ్స్, చిప్స్, మ్యాగీ, ఇతర స్నాక్ ఐటమ్స్‌ను చాలామంది ఇష్టంగా తింటుంటారు. వీటికి తోడు కూల్‌డ్రింక్స్ తప్పనిసరి అన్నట్లు కొందరు తీసుకుంటారు. కానీ ఇవి మన జీవితకాలాన్ని తగ్గించేస్తున్నాయని తెలుసా? ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తింటే శరీరానికి తగిన పోషకాలు అందవట. దీంతో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని తాజా పరిశోధనలో తేలింది.
Similar News
News December 16, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త వేడి నూనె వేయాలి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలకుండా ఉంటాయి.
News December 16, 2025
IPL Auction: వీరు అన్‌సోల్డ్

ఐపీఎల్-2026 వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన విదేశీ ఆటగాళ్లు డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, అట్కిన్సన్, లివింగ్‌స్టన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, వియాన్ ముల్డర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశీ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా(రూ.75 లక్షలు)ను కూడా పట్టించుకోలేదు.
News December 16, 2025
CTETకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్

CTETకు అప్లై చేయడానికి ఎల్లుండి వరకే అవకాశం ఉంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.EI.Ed అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. వెబ్‌సైట్: ctet.nic.in/


