News July 30, 2024
ఆర్బీఐ 90 ఏళ్ల జర్నీపై వెబ్ సిరీస్

1935 ఏప్రిల్ 1న ఏర్పాటైన ఆర్బీఐ.. వచ్చే ఏడాదికి 90 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఇన్నేళ్ల ప్రస్థానాన్ని ప్రజలకు వెల్లడించేందుకు 5 ఎపిసోడ్లతో వెబ్‌సిరీస్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25-30 నిమిషాలు ఉంటుందట. ఇందుకోసం నేషనల్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఆహ్వానించింది. 90 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను వెబ్‌సిరీస్‌లో చూపించనున్నారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<