News July 30, 2024

ఆర్బీఐ 90 ఏళ్ల జర్నీపై వెబ్ సిరీస్

image

1935 ఏప్రిల్ 1న ఏర్పాటైన ఆర్బీఐ.. వచ్చే ఏడాదికి 90 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఇన్నేళ్ల ప్రస్థానాన్ని ప్రజలకు వెల్లడించేందుకు 5 ఎపిసోడ్లతో వెబ్‌సిరీస్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25-30 నిమిషాలు ఉంటుందట. ఇందుకోసం నేషనల్ టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఆహ్వానించింది. 90 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను వెబ్‌సిరీస్‌లో చూపించనున్నారు.

Similar News

News October 7, 2024

Aiతో తెలుగు రాష్ట్రాల్లో 122M స్పామ్ కాల్స్ బ్లాక్: AIRTEL

image

స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు Airtel నెట్‌వర్క్‌లో <<14250922>>ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌<<>>ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెల 27 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీతో వినియోగదారులకు స్పామ్ కాల్స్‌ బెడద గణనీయంగా తగ్గింది. ఈ పదిరోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 122 మిలియన్ల స్పామ్ కాల్స్‌, 2.3M మెసేజ్లను బ్లాక్ చేసినట్లు AIRTEL తెలిపింది. ఈ ఫీచర్ ప్రతీ యూజర్‌కు అందుబాటులో ఉందని పేర్కొంది.

News October 7, 2024

ఊరెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు: TGSRTC

image

దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతోంది. రద్దీ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకు మరో 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ గల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇబ్బంది పడొద్దని, ఆర్టీసీలో సురక్షితంగా వెళ్లాలని సంస్థ ఎండీ సజ్జనార్ సూచించారు.

News October 7, 2024

మోదీతో ముగిసిన చంద్రబాబు భేటీ

image

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు అవసరమైన చర్యలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు, విజయవాడలోని బుడమేరు వాగు ప్రక్షాళన, వరద నష్టంపై చర్చించినట్లు తెలుస్తోంది.