News October 18, 2024
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ తీయనున్నట్లు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ జానీ ప్రకటించారు. దానికి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. దీనికి భారత చలనచిత్ర సంఘం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. దీపావళి అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News January 5, 2026
అసెంబ్లీ వేదికగా BRSపై కవిత విమర్శల దాడి

TG: శాసనమండలి వేదికగా BRSపై కవిత విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి తన బహిష్కరణ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వలేదన్నారు. సస్పెన్షన్‌కు ముందు వివరణ కూడా తీసుకోలేదని మండిపడ్డారు. పార్టీలో లేని ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. నైతికత లేని పార్టీలో ఉండలేకే బయటికి వచ్చానని, పదవి కూడా వద్దనుకొని రాజీనామా చేశానన్నారు. దాన్ని ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.
News January 5, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. TG సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, రాధాకిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. హరీశ్ ఆదేశాలతో రాధాకిషన్ ఫోన్ ట్యాప్ చేశారని 2024 DECలో FIR నమోదైంది. దీనిపై హరీశ్ కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం FIRను కొట్టివేసింది. ఇప్పుడు SCలోనూ ఆయనకు ఊరట దక్కింది. HC, SCలో ఎదురుదెబ్బ తగలడంతో ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
News January 5, 2026
బెండలో కాయ తొలుచు పురుగు నివారణ ఎలా?

బెండ మొక్క పెరుగుదల దశలో కాయ తొలిచే పురుగు మొక్క మొవ్వును, పూతను, కోత దశలో కాయలను తొలిచి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. పురుగు ఆశించిన కొమ్మలను, పురుగు ఆశించిన చోట నుంచి అంగుళం కిందికి తుంచి తొలగించాలి. వీటి నివారణకు కాయలు కోసిన తర్వాత లీటర్ నీటిలో 3గ్రా. కార్బరిల్ (లేదా) 2 మి.లీ. క్వినాల్‌ఫాస్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


