News October 18, 2024

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్

image

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్ తీయనున్నట్లు నోయిడాకు చెందిన వ్యాపారవేత్త అమిత్ జానీ ప్రకటించారు. దానికి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ అని టైటిల్ పెట్టినట్లు తెలిపారు. దీనికి భారత చలనచిత్ర సంఘం నుంచి అనుమతి కూడా తీసుకున్నామని, ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తామని పేర్కొన్నారు. దీపావళి అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.

Similar News

News November 10, 2024

సౌతాఫ్రికా టార్గెట్ 125

image

SAతో జరుగుతోన్న రెండో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ మాత్రమే చేసింది. ఓపెనర్లు శాంసన్ (0), అభిషేక్ శర్మ (4)తో పాటు సూర్య (4), రింకూ సింగ్ (9) ఫెయిల్ అయ్యారు. తిలక్ 20, అక్షర్ 27, హార్దిక్ 39* రన్స్ చేశారు.

News November 10, 2024

రాజస్థాన్‌లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు

image

కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.

News November 10, 2024

ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్, బదిలీలు

image

☞ ఆర్థికశాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్‌
☞ మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబు
☞ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
☞ కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
☞ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత