News April 6, 2024
సహజీవనం చేసి విడిపోయినా మహిళకు భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు
సహజీవనంలో ఉండే మహిళకు హక్కులను కల్పించే దిశగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకోకుండా పురుషుడితో సహజీవనం చేసి, విడిపోయిన తర్వాత మహిళ భరణం పొందేందుకు అర్హురాలే అని తెలిపింది. వారి మధ్య బంధం రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఓ మహిళకు నెలకు రూ.1,500 భరణం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
Similar News
News November 7, 2024
రోహిత్ కెప్టెన్సీ కొనసాగించాల్సిందే: ఫించ్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆ సిరీస్ అంతటికీ కొత్త కెప్టెన్‌ను నియమించాలని గవాస్కర్ ఇటీవల పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘రోహిత్ భారత్‌కి కెప్టెన్. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఎంజాయ్ చేసే హక్కు అతడికి కచ్చితంగా ఉంటుంది. తిరిగి వచ్చాక అతడే మళ్లీ కెప్టెన్‌గా ఉండాలి’ అని స్పష్టం చేశారు.
News November 7, 2024
ఆ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు!
మన పొరుగు దేశం భూటాన్‌లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.
News November 7, 2024
PHOTOS: కన్నీళ్లు పెట్టుకున్న కమల మద్దతుదారులు
అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తీవ్రంగా పోరాడినా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేకపోయారు. కౌంటింగ్ సందర్భంగా ఆమె ఏ దశలోనూ ట్రంప్‌ను అందుకోలేపోయారు. ఫలితాల సరళిని బట్టి కమల ఓటమి లాంఛనం కావడాన్ని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.