News January 21, 2025
నేటి నుంచి చిన్నారులకు ఆధార్ క్యాంపులు

AP: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 0-6 ఏళ్లు గల చిన్నారుల కోసం ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ నెల 21-24, 27-30 వరకు ఆధార్ నమోదు చేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,06,264 మంది చిన్నారుల్లో 9,80,575 మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. కార్యక్రమం విజయవంతం చేయాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 12, 2025
కష్టాలు ఎన్ని రకాలంటే..?

మనుషులు పడే కష్టాలను వేదాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అందులో మొదటిది ఆధ్యాత్మిక దుఖాలు. శరీరంలో కలిగే రోగాలు, కోపం, కపటం, బద్ధకం వల్ల అంతర్గతంగా ఏర్పడతాయి. రెండవది ఆది భౌతిక దుఃఖాలు. ఇవి పంచభూతాలు, శత్రువులు, జంతువులు, కీటకాల వంటి బయటి జీవుల వల్ల కలుగుతాయి. మూడవది ఆది దైవిక దుఃఖాలు. ఇవి ప్రకృతి శక్తులైన అతివృష్టి, అనావృష్టి, పిడుగులు, గ్రహబాధల వల్ల సంభవిస్తాయి. వీటిని దాటడమే మోక్షం. <<-se>>#VedikVibes<<>>
News November 12, 2025
లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు: YCP

AP: తమ హయాంలో తిరుమల శ్రీవారి వైభవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నాం తప్ప ఎలాంటి తప్పూ చేయలేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి అవకాశమే లేదు. కావాలంటే రికార్డులు చూసుకోండి. సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీగా సమాధానం ఇచ్చారు. కల్తీ నెయ్యి అంటూ గగ్గోలు పెట్టిన పచ్చమంద సైలెంట్ అయింది’ అని విమర్శించింది.
News November 12, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

* గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు హోంమంత్రి అనిత సూచించారు. డ్రగ్స్ వాడినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని మంత్రి సత్యప్రసాద్ ఫైరయ్యారు. సెంటు పట్టా పేరుతో ₹7,500Cr దోచుకున్నారని ఆరోపించారు.
* శ్రీకాకుళం IIITలో సృజన్(20) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు కారణాలు తెలియరాలేదు.


