News December 17, 2024

నేటి నుంచి అంగన్వాడీలో ఆధార్ క్యాంపులు

image

AP: నేటి నుంచి 20వరకు, ఈ నెల 26-28 వరకు రాష్ట్ర‌వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇక్కడ చిన్నపిల్లలకే ఆధార్ కార్డుల జారీ ఉండనుంది. రాష్ట్రంలో 0-6ఏళ్ల వయసు గల పిల్లల్లో 11లక్షల మంది వరకు ఆధార్ నమోదు చేసుకోలేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోని పిల్లలకు ఆధార్ లేదని స్పష్టం చేసింది. ఆధార్ క్యాంపుల కోసం కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News January 13, 2025

ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో ర‌ష్యా త‌ర‌ఫున పోరాడుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్‌ వాసి బినిల్(32) మృతి చెందారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయ‌ప‌డిన‌ట్టు ఫ్యామిలీకి స‌మాచారం వ‌చ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భార‌త ఎంబ‌సీని సంప్ర‌దించ‌గా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీక‌రించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్ద‌రూ గతంలో విఫ‌ల‌ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

News January 13, 2025

బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?

image

యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.

News January 13, 2025

ఇన్ఫోసిస్: వచ్చే నెలలో జీతాల పెంపు?

image

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఫిబ్రవరిలో జీతాలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. కన్సల్టెంట్లు, సీనియర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు తదితరులకు జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సంస్థలోని ఉన్నతోద్యోగులకు హైక్ లెటర్స్ మార్చిలో అందజేసే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో <<15078700>>హైక్ ఇచ్చిన<<>> విషయం తెలిసిందే.