News December 3, 2024
రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్‌కు సన్మానం
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సన్మానం జరగనుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్‌తో పాటు ఆమిర్‌ను సత్కరించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు ట్విటర్‌లో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14 వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు ఆండ్రూ గార్ఫీల్డ్, ఈవా లాంగోరియా, బాలీవుడ్ నుంచి కరీనా కపూర్, రణ్‌బీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Similar News
News January 26, 2025
నేడు మధ్యప్రదేశ్‌కు సీఎం రేవంత్
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ అంబేడ్కర్ నగర్‌లో నిర్వహించనుంది. ‘సంవిధాన్’ పేరిట రేపు జరిగే ఆ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
News January 26, 2025
ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా: బాలకృష్ణ
తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ‘శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు. NTR వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులకు, ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను. నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News January 26, 2025
అజిత్‌కు ‘పద్మ భూషణ్’; కరెక్టా? కౌంటరా?
కోలీవుడ్ హీరో అజిత్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై తమిళనాట డివైడ్ డిస్కషన్ అవుతోంది. ఇది తగిన గౌరవమని తల ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఇందులో BJP రాజకీయం ఉందని విజయ్ వర్గం ఆరోపిస్తోంది. గతంలో MGR, కమల్ పార్టీలు పెట్టినప్పుడు శివాజీ గణేషన్, రజినీకాంత్‌లకు ఇలాగే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చిందని, ఇప్పుడు తమ హీరో పార్టీ ప్రకటించాక అజిత్‌కు అవార్డుతో కౌంటర్ పాలిట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు.