News October 8, 2024
88 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే స్థితిలో AAP
హరియాణా ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రదర్శన దారుణంగా ఉంది. 90కి గాను 88 స్థానాల్లో పోటీచేయగా అన్నింట్లోనూ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో తొలి 2 స్థానాల కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతోంటే 4, 5, 6 ప్లేసుల్లో ఆప్ ఉంటోంది. EC ప్రకారం జస్ట్ 1.69% ఓట్‌షేర్ సంపాదించింది. అంటే లక్ష ఓట్లన్నమాట. JJP 0.92, BSP 1.62%తో పోలిస్తే కాస్త బెటరే.
Similar News
News November 6, 2024
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రపంచ నలుమూలల క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఎన్నికల్లో ఒక ఓటరు తన ఓటును బాలయ్యకు వేశారు. ఏ అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారనే విభాగంలో ఇష్టమైన వ్యక్తి పేరు రాసి ఓటు వేసే అవకాశం ఉండటంతో సదరు వ్యక్తి ‘బాలయ్య’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
News November 6, 2024
మిస్టీరియస్.. ఈ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే!
భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్‌కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.
News November 6, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు
AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.