News November 22, 2024
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్
Febలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధమవుతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా ఆప్ ప్రభుత్వ సేవలపై చర్చకు ‘రెవ్డీ పర్ చర్చా’ పేరుతో కొత్త కార్యక్రమంతోపాటు 6 గ్యారంటీలు అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఇస్తున్న ఉచిత విద్యుత్, నీరు, చదువు, వైద్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ప్రతి మహిళకు రూ.వెయ్యి, పెద్దవారికి తీర్థయాత్ర యోజన హామీలు ఇచ్చింది.
Similar News
News December 6, 2024
కుత్బుల్లాపూర్ MLA ఇంటి వద్ద ఉద్రిక్తత
TG: కుత్బుల్లాపూర్ MLA వివేకానంద ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టగా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి, హరీశ్ రావు, పల్లా అరెస్టుల నేపథ్యంలో BRS శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.
News December 6, 2024
రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. ఊరుకోం: పల్లా
TG: అక్రమ అరెస్టులకు భయపడేది లేదని BRS నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తీరు సరిగా లేదని మా మాజీ మంత్రులు, నేతలు ఆయన్ను కలవడానికి వెళ్లాం. చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని అరెస్ట్ చేసి అనేక స్టేషన్లు తిప్పారు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే. మీ అక్రమాలు సహించం’ అని పల్లా అన్నారు. నార్సింగి PS వద్దకు భారీగా BRS శ్రేణులు చేరుకోగా, అర్ధరాత్రి పల్లాను పోలీసులు విడుదల చేశారు.
News December 6, 2024
పుష్ప-2 అద్భుతం.. యంగ్ హీరోల ప్రశంసలు
పుష్ప-2 సినిమాపై యంగ్ హీరోలు సందీప్ కిషన్, శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు. ‘నాకు ఇష్టమైన అల్లు అర్జున్, సుకుమార్, ఫహాద్, రష్మిక, శ్రీలీల, DSP ప్రదర్శన అమోఘం. ఎక్కడ చూసినా ఇదే వైబ్ కొనసాగుతోంది’ అని సందీప్ పేర్కొన్నారు. ‘బన్నీ రప్పా రప్పా పర్‌ఫార్మెన్స్, సుకుమార్ విజినరీ డైరెక్షన్, రష్మిక, ఫహాద్ నటన అద్భుతం. మూవీ టీమ్‌కు కంగ్రాట్స్’ అని శ్రీవిష్ణు రాసుకొచ్చారు.