News December 15, 2024

ఎన్నికలకు ఆప్ రెడీ.. అభ్యర్థుల ప్రకటన పూర్తి

image

Febలో జ‌రిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆప్ పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. 38 మందితో కూడిన అభ్యర్థుల నాలుగో జాబితాను ఆదివారం ప్రకటించింది. ఈ సారి కూడా న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, కాల్కాజీ నుంచి సీఎం ఆతిశీ పోటీ చేయ‌నున్నారు. మొత్తం 70 మంది అభ్య‌ర్థుల్లో 20 మంది సిట్టింగ్‌ల‌కు టికెట్లు నిరాక‌రించింది. పలువురికి స్థానచలనం కల్పించింది. కేజ్రీవాల్‌పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ పోటీ చేయనున్నారు.

Similar News

News January 21, 2025

డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించొద్దు: జనసేన

image

AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.

News January 21, 2025

ముగిసిన KRMB సమావేశం

image

TG: హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

News January 21, 2025

హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట

image

AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.