News February 28, 2025

ఆప్ హెల్త్‌కేర్ మోడల్ డొల్ల.. డొల్ల: CAG రిపోర్టు

image

CAG నివేదికలు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీ Govt ఆస్పత్రుల్లో 50-60% డాక్టర్ల కొరత ఉందని హెల్త్‌కేర్ నివేదిక పేర్కొంది. సర్జరీల కోసం రోగులు 6-8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చినట్టు తెలిపింది. 14 ఆస్పత్రుల్లో ICU, 16లో బ్లడ్‌బ్యాంక్స్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్, మార్చురీలు లేవంది. కేంద్రమిచ్చిన కొవిడ్ నిధుల్ని ఖర్చు చేయలేదని, మొహల్లా క్లినిక్కుల్లో బాత్రూములు లేవంది.

Similar News

News February 28, 2025

CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చింది.

News February 28, 2025

వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

image

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.

News February 28, 2025

అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌కు సీఎం అభినందనలు

image

AP: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఆమె కలవగా అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

error: Content is protected !!