News February 28, 2025
ఆప్ హెల్త్‌కేర్ మోడల్ డొల్ల.. డొల్ల: CAG రిపోర్టు

CAG నివేదికలు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. ఢిల్లీ Govt ఆస్పత్రుల్లో 50-60% డాక్టర్ల కొరత ఉందని హెల్త్‌కేర్ నివేదిక పేర్కొంది. సర్జరీల కోసం రోగులు 6-8 నెలలు ఎదురుచూడాల్సి వచ్చినట్టు తెలిపింది. 14 ఆస్పత్రుల్లో ICU, 16లో బ్లడ్‌బ్యాంక్స్, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్, మార్చురీలు లేవంది. కేంద్రమిచ్చిన కొవిడ్ నిధుల్ని ఖర్చు చేయలేదని, మొహల్లా క్లినిక్కుల్లో బాత్రూములు లేవంది.
Similar News
News March 27, 2025
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఢిల్లీ ప్రభుత్వం మందుల సేకరణ విధానంపై సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రులు ఇకపై పీఎం జన ఔషధి కేంద్రాల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇది అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపింది. మెడిసిన్స్ కొనుగోలును మరింత పారదర్శకంగా మార్చేందుకు, తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై ఢిల్లీ సర్కారు MoU కూడా కుదుర్చుకుంది.
News March 27, 2025
బంగ్లా ఫ్రీడమ్ డే.. యూనస్‌కు మోదీ లేఖ

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. 1971 యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పునాది పడిన రోజుగా అభివర్ణించారు. ఇకపైనా ‘సున్నితమైన’ అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా యూనస్‌తో పాటు బంగ్లా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
News March 27, 2025
ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక

తన కాలి గాయం మానేందుకు 9 నెలల సమయం పడుతుందని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. సోషల్ మీడియలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కొంత కోలుకున్నానని, నడవగలుగుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎత్తైన ప్రదేశాలు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని పేర్కొన్నారు. కాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయంతోనే ‘ఛావా’ ప్రమోషన్లకు హాజరయ్యారు.