News January 7, 2025

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు: షర్మిల

image

AP: పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. దివంగత సీఎం YSR మానసపుత్రిక అయిన సంజీవని లాంటి ఆ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులైనా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని షర్మిల చెప్పారు.

Similar News

News January 20, 2025

కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

image

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.

News January 20, 2025

సంజయ్ రాయ్‌కి నేడు శిక్ష ఖరారు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేయనుంది. గతేడాది AUG 9న RGకర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిని రేప్ చేసి చంపేశారు. ఈ కేసులో అక్కడ పనిచేసే సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 3 రోజుల క్రితం కోర్టు అతడిని దోషిగా తేల్చింది. అటు దీని వెనుక మరింత మంది ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News January 20, 2025

రద్దీగా మారిన హైదరాబాద్

image

నేటి నుంచి ఆఫీస్‌లు, పాఠశాలలు పూర్తిస్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్‌లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయల్దేరి మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, RTC బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. MGBS, JBS సహా అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, LBనగర్ తదితర ప్రాంతాలు RTC, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో సందడిగా మారాయి.