News May 21, 2024
ఈబీసీ నేస్తం నిధుల జమ
AP: ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ.15 వేలు ప్రభుత్వం జమ చేసింది. కాగా మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించి బటన్ నొక్కారు. ఈ పథకానికి మొత్తం రూ.629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డీబీటీ నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది.
Similar News
News December 11, 2024
ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
News December 11, 2024
సియారామ్ బాబా.. ఇక లేరు
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సియారామ్ బాబా ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన కడసారి చూపు కోసం మధ్యప్రదేశ్‌లోని భట్యాన్‌లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రామచరిత మానస్ పఠిస్తూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. నర్మదా నది ఘాట్లను ఆయన ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు.
News December 11, 2024
ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్
AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్‌లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.