News May 15, 2024
హైదరాబాద్ జూలో ‘అభిమన్యు’ మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల పులి ‘అభిమన్యు’ అనారోగ్యంతో మృతిచెందింది. ఇది అరుదైన తెలుపు బెంగాల్ టైగర్ కావడం గమనార్హం. బద్రి, సురేఖ అనే పులులకు 2015, జనవరి 2న ఇదే జూలో ఈ పులి జన్మించింది. నెఫ్రిటిస్ సమస్యతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇబ్బంది పడుతోందని జూ అధికారులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆహారం తినలేదని, మంగళవారం మధ్యాహ్నం ప్రాణం విడిచిందని వెల్లడించారు.
Similar News
News March 4, 2026
శ్రీకాకుళం జిల్లాలో 13 ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లా స్త్రీ&శిశు సంక్షేమం శాఖ, వన్ స్టాప్ సెంటర్‌లో 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సైకో సోషల్ కౌన్సిలర్, కేస్ వర్కర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్ స్టాఫ్ తదితర పోస్టులు ఉన్నాయి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: srikakulam.ap.gov.in/
News March 4, 2026
దివ్యాంగులకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం.. TG ప్రభుత్వం క్లారిటీ

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో TGSRTC బస్సుల్లోనూ దివ్యాంగులందరికీ పూర్తిగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని TG ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉందని తెలిపింది.
News March 4, 2026
₹17 లక్షల డ్రోన్ కోసం ₹33 కోట్ల మిస్సైల్: ఇరాన్ ‘కాస్ట్ వార్’ వ్యూహం!

సుమారు ₹17 లక్షల విలువైన ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చడానికి అమెరికా ₹33 కోట్ల విలువైన పేట్రియాట్ మిస్సైళ్లను వాడుతున్నట్లు సమాచారం. ఈ వ్యూహంతో అమెరికా రక్షణ నిల్వలను దెబ్బతీయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ వంటి దేశాల వద్ద మిస్సైల్ నిల్వలు కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఆయుధాలు ఎవరి దగ్గర ముందుగా అయిపోతాయన్నదే ఈ యుద్ధ గమనాన్ని నిర్ణయించనుంది.


