News December 2, 2024

పెళ్లయిన మగవారికి అభిషేక్ బచ్చన్ సలహా

image

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న అభిషేక్‌ ‘హస్పెండ్ టిప్స్’ ఇచ్చారు. ‘పెళ్లయిన వాళ్లంతా మీ భార్యలు చెప్పింది చేయండి’ అన్నారు. దీంతో తాను తన భార్య మాట వింటున్నానని, విడాకులు ఎందుకు తీసుకుంటానని అభిషేక్ చెప్పకనే చెప్పారని కొందరంటున్నారు.

Similar News

News March 17, 2026

IPL-2026: చెన్నై తుది జట్టు ఇదేనా?

image

IPL-2026: గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి చెన్నై జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో తుది జట్టు ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. క్రికెట్ విశ్లేషకుల అంచనా ఇది..
CSK: ఆయుష్ మాత్రే, సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(C), బ్రెవిస్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, ధోనీ, నాథన్ ఇల్లిస్, నూర్ అహ్మద్, హెన్రీ/ఖలీల్ అహ్మద్.

News March 17, 2026

EAPCET దరఖాస్తు గడువు మరోసారి పెంపు

image

AP EAPCET దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా మరోసారి ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24వ తేదీ వరకూ <>అప్లై<<>> చేసుకోవచ్చు. రూ.1000 లేట్ ఫీజుతో ఈ నెల 28, రూ.2వేలతో ఏప్రిల్ 1, రూ.4వేలతో ఏప్రిల్ 6, రూ.10,000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అప్లికేషన్లలో కరెక్షన్స్ చేసుకోవచ్చు.

News March 17, 2026

మాకు ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్

image

NATO దేశాలు ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. ‘నాటో ఎప్పుడూ వన్-వే ట్రాఫిక్ లాంటిదే. మేం వారిని రక్షిస్తాం. కానీ వారు మాకు సాయం చేయరు’ అని విమర్శించారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే చిన్నాభిన్నం చేశామని పేర్కొన్నారు. అందుకే ఇకపై తమకు ఎవరి సాయం అవసరం లేదని, అమెరికా ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు.