News December 2, 2024

పెళ్లయిన మగవారికి అభిషేక్ బచ్చన్ సలహా

image

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గొన్న అభిషేక్‌ ‘హస్పెండ్ టిప్స్’ ఇచ్చారు. ‘పెళ్లయిన వాళ్లంతా మీ భార్యలు చెప్పింది చేయండి’ అన్నారు. దీంతో తాను తన భార్య మాట వింటున్నానని, విడాకులు ఎందుకు తీసుకుంటానని అభిషేక్ చెప్పకనే చెప్పారని కొందరంటున్నారు.

Similar News

News February 10, 2025

5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

image

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News February 10, 2025

ప్రశాంతమైన జీవితానికి 8 సూత్రాలు

image

– ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు
– ఎక్కువ గమనించు
– తక్కువ మాట్లాడు
– ఎప్పుడూ నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు
– నేర్చుకోవడం మానేయకు
– ఈగో, వాదించడం, కోపాన్ని కంట్రోల్ చేసుకో
– ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు
– ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకో

News February 10, 2025

13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

image

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.

error: Content is protected !!