News March 29, 2024
అభిషేక్.. మరోసారి అలా ఔట్ అవ్వకు: యువరాజ్

సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మను అభినందిస్తూనే సున్నితంగా హెచ్చరించాడు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. ముంబైతో మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినందుకు అభిషేక్‌ను ప్రశంసించారు. అయితే చెత్త షాట్‌కు ఔట్ కావడం మంచిది కాదని సూచించారు. మరోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయంటూ పోస్ట్ చేశారు. కాగా మొన్న ముంబై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 11, 2025
కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్‌డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
News November 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 63

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 11, 2025
నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు.. అప్లై చేశారా?

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST,SC, దివ్యాంగులకు మినహాయింపు కలదు. https://ner.indianrailways.gov.in/


