News March 29, 2024

అభిషేక్.. మరోసారి అలా ఔట్ అవ్వకు: యువరాజ్

image

సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మను అభినందిస్తూనే సున్నితంగా హెచ్చరించాడు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. ముంబైతో మ్యాచ్‌‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినందుకు అభిషేక్‌ను ప్రశంసించారు. అయితే చెత్త షాట్‌కు ఔట్ కావడం మంచిది కాదని సూచించారు. మరోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయంటూ పోస్ట్ చేశారు. కాగా మొన్న ముంబై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?

image

AP: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువ, బుక్ వాల్యూ మధ్య తేడాలున్నాయని, వీటిని సరిచేసి రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారని సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు త్వరలోనే స్పష్టత ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

News January 22, 2025

ఐటీ సోదాలు అందరిపై జరుగుతున్నాయి: దిల్ రాజు

image

హైదరాబాద్‌లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. నిన్నటి నుంచి SVC, మైత్రి మూవీస్‌తో పాటు పలు సంస్థల కార్యాలయాలపై ఐటీ తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

News January 22, 2025

BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!

image

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.