News December 4, 2024

దక్షిణ కొరియాలో సైనిక పాలన రద్దు

image

దక్షిణ కొరియాలో విధించిన సైనిక పాలనను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రకటించారు. విపక్ష డెమోక్ర‌టిక్ పార్టీ(DP)తోపాటు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే ఆయన నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య‌ కిమ్ కియోన్-హీ ర‌క్షించ‌డానికే యూన్ సైనిక పాల‌న విధించిన‌ట్లు సమాచారం.

Similar News

News March 30, 2026

జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్‌ ముదిరిపోయింది: టీడీపీ

image

AP: మూలపేట <<19518755>>పోర్టును<<>> 70% తానే పూర్తి చేసినట్లు జగన్ చెప్పుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్‌ ముదిరిపోయిందని ట్వీట్ చేసింది. ‘నిజానికి అది భావనపాడు పోర్టు. దాని పనులు అంతకుముందు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. YCP హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు’ అని మండిపడింది.

News March 30, 2026

BREAKING: వైభవ్ విధ్వంసం

image

చెన్నైతో మ్యాచ్‌లో RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇందులో 5 సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 17 బంతుల్లో 52 రన్స్ చేసి ఔటయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన CSK 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

News March 30, 2026

భారత భవిష్యత్తును మోదీ తాకట్టుపెట్టారు: రాహుల్

image

PM మోదీ తనను, తన వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారని LoP రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన భారత భవిష్యత్తును తాకట్టు పెట్టారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ‘మోదీ పాలనలో డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం రూ.100 దిశగా సాగుతోంది. స్టాక్స్, ఎకానమీ, ఇన్‌కమ్, సేవింగ్స్ పడిపోయాయి. ఉద్యోగాలు మాయమయ్యాయి. సిలిండర్లు అందుబాటులో లేవు. వీటన్నిటికీ మోదీ రాజీపడటమే కారణం’ అని ట్వీట్ చేశారు.