News December 4, 2024
దక్షిణ కొరియాలో సైనిక పాలన రద్దు
దక్షిణ కొరియాలో విధించిన సైనిక పాలనను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రకటించారు. విపక్ష డెమోక్రటిక్ పార్టీ(DP)తోపాటు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే ఆయన నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య కిమ్ కియోన్-హీ రక్షించడానికే యూన్ సైనిక పాలన విధించినట్లు సమాచారం.
Similar News
News January 26, 2025
పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి
TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.
News January 26, 2025
‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి
‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
News January 26, 2025
కవులు, కళాకారులు తెలంగాణలో లేరా?: RSP ప్రశ్న
TG: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలపై BRS నేత RS ప్రవీణ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన మందకృష్ణ మాదిగ, డా.నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు చెబుతూనే కేంద్రంపై మండిపడ్డారు. సాహిత్యం, కళల రంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. TGలో కవులు, కళాకారులు లేనే లేరా? కేవలం APలోనే ఉన్నారా? అంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలను ప్రశ్నించారు.