News December 3, 2024

ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్‌ కీలక నిర్ణయం

image

AP: పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలుపెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక, స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది.

Similar News

News November 28, 2025

విజయవాడ ఆసుపత్రిలో క్యాన్సర్‌ చికిత్సకు ‘లినాక్’ పరికరం

image

విజయవాడ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా లీనియర్ యాక్సిలరేటర్ పరికరాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు. ఈ అత్యాధునిక ‘లినాక్’ పరికరం సమకూర్చేందుకు సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

News November 28, 2025

WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

image

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు

News November 28, 2025

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలుగా, మడకశిర, బనగానపల్లె, నక్కపల్లి, అద్దంకి, పీలేరును రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.