News December 3, 2024

ఆ గృహాలు రద్దు.. క్యాబినెట్‌ కీలక నిర్ణయం

image

AP: పలు కారణాలతో గత ఐదేళ్లలో నిర్మాణం మొదలుపెట్టని గృహాలను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు ఓకే చెప్పింది. సమీకృత పర్యాటక, స్పోర్ట్స్ పాలసీ 2024-29, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహిస్తామని ప్రకటించింది.

Similar News

News January 22, 2025

AP & TGలో ఏడాదికి రూ.కోటి సంపాదించేవారు ఎంతంటే?

image

ఏడాదికి రూ.కోటి సంపాదించే వారు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్-2024 డేటా ప్రకారం అక్కడ ఏకంగా 1,24,800 మంది కోటికి పైగా సంపాదిస్తున్నారు. అత్యల్పంగా లక్షద్వీప్‌లో కేవలం ఒకరు, లద్దాక్‌లో ముగ్గురు మాత్రమే రూ.1 కోటి అర్జిస్తున్నారు. ఇక ఏపీలో 5,340 మంది ఉండగా తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.

News January 22, 2025

మీరే ప్రధాని అయితే..

image

USA అధ్యక్షుడైన తొలిరోజే ట్రంప్ సంతకాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. పుట్టుకతో పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ సహా అనేక ముఖ్య నిర్ణయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఈ సంతకాలపై USతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ‘ఒకే ఒక్కడు’లో ఒక్కరోజు CMలా, మీరు ఒక్కరోజు ప్రధానిగా ఒక్క నిర్ణయం అమలు చేసే అధికారం వస్తే ఏ ఫైలుపై సైన్ చేస్తారు? కామెంట్ చేయండి.

News January 22, 2025

తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?

image

టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.