News May 20, 2024

ABSOLUTELY GORGEOUS

image

కమ్ముకున్న మేఘాలు.. జాలువారిన చిరుజల్లులు.. చల్లటి గాలుల మధ్య ఉప్పల్ స్టేడియం అందాన్ని సంతరించుకుంది. చూడగానే విదేశీ స్టేడియాన్ని తలపించిన దీనిని చూసి నెటిజన్లు వావ్ అన్నారు. నిన్న సంధ్యవేళ ఈ చిత్రాలను కెమెరామెన్లు క్లిక్ మనిపించగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. లార్డ్స్, ఈడెన్ గార్డెన్స్, ధర్మశాల స్టేడియాల కంటే ఉప్పల్ సుందరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News December 9, 2024

చంద్రబాబు, పవన్‌కు థాంక్యూ: బొత్స

image

AP: నాడు-నేడు ద్వారా స్కూళ్లలో YCP చేసిన అభివృద్ధిని చంద్రబాబు, పవన్ ప్రజలకు మరోసారి చూపించారని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందని, ఈనెల 13న కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించారని, చివరికి ఏం లేదని తేల్చారని పేర్కొన్నారు.

News December 9, 2024

‘పుష్ప-2’ కలెక్షన్స్ సునామీ

image

‘పుష్ప-2’ సినిమా హిందీలో 4 రోజుల్లోనే రూ.291కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రూ.86 కోట్లు వసూలు చేసిందని, హిందీ బెల్ట్‌లో ఒక్క రోజులో ఇంత మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని పేర్కొంది. అత్యంత వేగంగా రూ.290 కోట్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు తెలిపింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ $9.4M వసూలు చేసినట్లు ప్రకటించింది.

News December 9, 2024

మైగ్రేన్‌తో గుండెపోటు & స్ట్రోక్: వైద్యులు

image

మారిన జీవనశైలి ఎంతో మందికి మైగ్రేన్ హెడేక్‌ను తెచ్చిపెట్టింది. ప్రపంచంలో 100 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారు. దీనిని నెగ్లెక్ట్ చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది గుండెపోటు & స్ట్రోక్‌కు కారణం అవుతుందని చెబుతున్నారు. ‘మైగ్రేన్ ఉన్న వ్యక్తులకు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం ఉంది. 43% హెమరేజిక్ స్ట్రోక్ ప్రమాదం. Migraine with aura వారికి హృదయనాళ మరణ ప్రమాదం ఎక్కువ’ అని పేర్కొంటున్నారు.