News July 22, 2024
సమృద్ధిగా వర్షాలు.. పంటలు బాగా పండుతాయి: స్వర్ణలత
TG: మట్టి బోనమైనా, బంగారు బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా స్వీకరిస్తానని సికింద్రాబాద్ ‘భవిష్యవాణి’లో స్వర్ణలత తెలిపారు. ‘ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలకు వ్యాధులు రాకుండా కాపాడతాను. కానీ పంటలు గతంలో లాగా పండించడం లేదు. రసాయనాలు ఎక్కువ వాడటం వల్లే వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించుకుంటే వ్యాధులు తగ్గుతాయి’ అని వివరించారు.
Similar News
News October 14, 2024
జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా..
AP: అమరావతి నిర్మాణంపై కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగా కనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతర నిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్‌లోపు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News October 14, 2024
న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం
AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
News October 14, 2024
రేషన్ బియ్యం తింటే ఇన్ని లాభాలా?
రూపాయికే కిలో బియ్యం అనేసరికి అంతా చులకనగా చూస్తుంటారు. మార్కెట్‌లో దొరికే సన్న బియ్యంవైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, రేషన్ బియ్యం తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయనే విషయం మీకు తెలుసా? ప్రజల్లో రక్తహీనత, విటమిన్ల లోపం ఉందని గుర్తించిన కేంద్రం.. పోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తోంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12లను యాడ్ చేసిన బియ్యాన్ని 2028 DEC వరకు ఉచితంగా ఇవ్వనుంది.
SHARE IT