News February 1, 2025

రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV

image

AP: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విశ్రాంత IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావును(ABV)ను ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో ABV రెండు సార్లు సస్పెండ్ కాగా, ఆ కాలాన్ని ప్రభుత్వం ఇటీవలే క్రమబద్ధీకరించింది. సస్పెన్షన్‌కు గురికాకపోతే వచ్చే అలవెన్సులు, వేతనం చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News

News February 15, 2025

మహిళా క్రికెటర్‌కు హీరో శివ కార్తికేయన్ సాయం!

image

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.

News February 15, 2025

కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

image

ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

News February 15, 2025

రెండోసారి తల్లి కాబోతున్న హీరోయిన్ ఇలియానా

image

గోవా బ్యూటీ ఇలియానా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు. తాజాగా విడుదల చేసిన ఇన్‌స్టా రీల్‌లో ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించడంతో పాటు మిడ్‌నైట్ స్నాక్స్ ఫొటోలను పంచుకుంది. ‘నువ్వు గర్భవతివని నాకు చెప్పకుండా గర్భవతివని చెప్పు’ అని రాసుకొచ్చింది. కాగా మైఖేల్ డోలన్‌ను పెళ్లాడిన ఇలియానాకు 2023 ఆగష్టులో కోవా ఫోనిక్స్ డోలన్ అనే బాబు పుట్టాడు.

error: Content is protected !!