News March 10, 2025
ఏసీ ధరలు పెరిగే అవకాశం

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏసీలకు గిరాకీ పెరుగుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి. ఎండ తీవ్రత పెరిగి, 25-30% వరకు అధికంగా అమ్మకాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఏసీ కంపెనీలు వాటి తయారీ పెంచుతున్నాయి. అయితే ఇందుకు తగ్గట్లు విడిభాగాలు సరఫరా కావడం లేదు. దీంతో ఏసీల ధరలు 4-5% పెరగొచ్చని తెలుస్తోంది. రకాన్ని బట్టి ఒక్కో ఏసీపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగే ఆస్కారం ఉంది.
Similar News
News March 20, 2025
మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్‌ను వంగబెట్టి దంచరా?: సీఎం రేవంత్

TG: తనకు పరిపాలనపై పట్టు రాలేదని BRS చేస్తున్న విమర్శలపై CM రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే KTR తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.
News March 20, 2025
ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు? : కామెంటేటర్

ఉప్పల్ స్టేడియానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడంతో పాటు అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై క్రికెట్ కామెంటేటర్ వెంకటేశ్ ప్రశ్నించారు. ‘హైదరాబాద్ క్రికెట్‌కు రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం? HYD క్రికెట్‌కు వన్నె తెచ్చిన అబిద్ అలీ, ML జయసింహ లాంటి వారి విగ్రహాలు పెడితే బాగుండేది’ అని డిమాండ్ చేశారు. అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియంలపై నెటిజన్లు ప్రశ్నించగా వాటిని కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
News March 20, 2025
భారీ ఎన్కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.