News April 1, 2025
గిగ్ వర్కర్ల కోసం ‘AC రెస్ట్ రూమ్స్’

వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై ‘AC రెస్ట్ రూమ్స్’ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. HYDలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది.
Similar News
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.
News April 18, 2025
క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.
News April 18, 2025
TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.