News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
AP: నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అర్హులకు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు అందించనుంది. జగన్ బొమ్మ ఉన్న రేషన్ కార్డులకు బదులు కొత్తవాటిని ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పౌరసరఫరాలశాఖ అధికారికి వెబ్‌సైట్‌లోనూ అప్లై చేసుకోవచ్చు.
Similar News
News January 17, 2025
మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు
HYD మూసీ పరీవాహక భవనాలకు అరుదైన గుర్తింపు దక్కింది. వీటిని న్యూయార్క్‌కు చెందిన వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ ‘వరల్డ్ మోనుమెంట్స్ వాచ్-2025’ జాబితాలో చేర్చింది. హైకోర్టు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజ్, ఉమెన్స్ యూనివర్సిటీ వీటిలో ఉన్నాయి. కాగా కళ కోల్పోయిన ఈ చారిత్రక భవనాలకు సీఎం రేవంత్ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో పునర్వైభవం రానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News January 17, 2025
పోలవరం ఆలస్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల
AP: గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తన కేసులు, బెయిల్ కోసం జలాలపై హక్కులను ఆయన వదులుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని రైతులు క్షమించబోరని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కూడా జగనే కారణమని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు రెండు ఫేజ్‌లలో 51.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ ద్రోహం చేశారని మండిపడ్డారు.
News January 17, 2025
రాత్రి భోజనం చేయకపోతే…
బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్ వంటివి తినకూడదు.