News August 29, 2024
మోపిదేవి, మస్తాన్ రావుల రాజీనామాలకు ఆమోదం
AP: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు <<13965602>>రాజీనామాలను<<>> ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీ అయినట్లు రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. వీటికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలూ ఎన్డీయేకు దక్కే అవకాశం ఉంది.
Similar News
News September 10, 2024
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు
AP: పల్నాడు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉ.10.30 గం. కంటే ముందు, మ.3 గం.కు, సా.5 తర్వాత అటెండెన్స్ వేయాలంది. గతంలోనే ఈ రూల్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, MPDOలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.
News September 10, 2024
M&M, డాక్టర్ రెడ్డీస్ నుంచి సెబీ చీఫ్‌కు కోట్లలో ఆదాయం: కాంగ్రెస్
M&M, డాక్టర్ రెడ్డీస్ సహా ఇతర లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ చీఫ్ మాధబీ బుచ్ రూ.కోట్లలో ఆదాయం పొందారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. సెబీలో చేరినప్పటి నుంచి ఆమెకు చెందిన అగోరా అడ్వైజర్ కంపెనీ సుప్తావస్థలో ఉందంటున్నా 2016-2024 మధ్య రూ.2.95 కోట్లు పొందారని పేర్కొన్నారు. పిడిలైట్, ICICI, సెంబ్‌కార్ప్, విసు లీజింగ్ వారి క్లెయింట్లేనని చెప్పారు. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందన్నారు.
News September 10, 2024
కొత్త లైన్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి బండి వినతి
TG: కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయన నివాసంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. దీంతో పాటు జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా ఆదేశించాలన్నారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బండి ట్వీట్ చేశారు.