News January 28, 2025

హుస్సేన్ సాగర్‌లో ప్రమాద ఘటన.. ఒకరు మృతి

image

TG: హుస్సేన్ సాగర్‌లో ఇటీవల బోటులో జరిగిన <<15275981>>అగ్నిప్రమాద ఘటనలో<<>> ఓ వ్యక్తి మరణించాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. గల్లంతైన అజయ్ అనే యువకుడి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ‘భారతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో బాణసంచా కారణంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

కుజ దోషం అంటే ఏంటి?

image

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 23, 2025

కుజ దోషం తొలగిపోవాలంటే?

image

కుజ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ‘ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహీ.. తన్నో అంగారక ప్రచోదయాత్’ అనే గాయత్రి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం రోజున దాన ధర్మాలు చేయడం, హనుమంతుడిని పూజించడం ఎంతో మంచిదని అంటున్నారు.

News November 23, 2025

కేజీ రూపాయి.. డజను రూ.60!

image

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.