News August 24, 2024

సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదం.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత

image

AP: బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయంలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 18, 2025

ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 35 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/BE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9

image

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> 160 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్‌లో కనీసం 60% మార్కులతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.