News August 24, 2024
సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదం.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత
AP: బాపట్ల జిల్లా సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయంలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే వారిని బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 13, 2024
నేనొక సీరియల్ డేటర్: రెజీనా
ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.
News September 13, 2024
అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు?
AP: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అక్టోబర్‌లో అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
News September 13, 2024
ALERT.. మళ్లీ వర్షాలు
AP: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది. APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా.. రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.