News November 23, 2024
భర్తకు తోడుగా, పార్టీకి అండగా.. JMM విజయం వెనుక కల్పన
ఝార్ఖండ్లో JMM విజయం వెనుక కల్పనా సోరెన్ పాత్ర కీలకం. భర్త హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 39 ఏళ్లకే ఎంతో పరిణతితో వ్యవహరించారు. పార్టీ, కుటుంబ గొడవలను చాకచక్యంగా డీల్ చేశారు. గాండేయ్ బైఎలక్షన్లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి 200 సభల్లో పాల్గొన్నారు. భర్తకు తోడుగా, పార్టీకి అండగా నిలబడి విజయతీరాలకు చేర్చారు.
Similar News
News November 23, 2024
కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్
TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.
News November 23, 2024
ఝార్ఖండ్లో హిమంతకు ఎదురుదెబ్బ
ఝార్ఖండ్లో అస్సాం CM హిమంత బిశ్వ శర్మ వేసిన పాచికలు పారలేదు. బంగ్లా చొరబాటుదారులు స్థానిక మెజారిటీ గిరిజనుల హక్కులు లాక్కుంటున్నారని బిల్డ్ చేసిన నెరేటివ్ ప్రభావం చూపలేదు. ట్రైబల్ స్టేట్లో కమ్యూనల్ పోలరైజేషన్ ఫలితాన్నివ్వలేదు. రోటీ-బేటి-మట్టీ నినాదం ఓటర్లను ఆకర్షించలేదు. మహిళలకు ఆర్థిక సాయం పథకాలు, హేమంత్ సోరెన్ అరెస్టు వల్ల ఏర్పడిన సానుభూతి JMMకు లాభం చేశాయి.
News November 23, 2024
హిందీ మహా విద్యాలయం అనుమతులు రద్దు
హైదరాబాద్లోని హిందీ మహా విద్యాలయం అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ (OU) రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నిజం అని దర్యాప్తులో తేలడంతో తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు, హిందీ మహా విద్యాలయం అటానమస్ హోదాను రద్దు చేయాలని UGCకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు OU అవకాశం కల్పించింది.