News November 23, 2024

భర్తకు తోడుగా, పార్టీకి అండగా.. JMM విజయం వెనుక కల్పన

image

ఝార్ఖండ్‌లో JMM విజయం వెనుక కల్పనా సోరెన్ పాత్ర కీలకం. భర్త హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 39 ఏళ్లకే ఎంతో పరిణతితో వ్యవహరించారు. పార్టీ, కుటుంబ గొడవలను చాకచక్యంగా డీల్ చేశారు. గాండేయ్ బైఎలక్షన్‌లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి 200 సభల్లో పాల్గొన్నారు. భర్తకు తోడుగా, పార్టీకి అండగా నిలబడి విజయతీరాలకు చేర్చారు.

Similar News

News December 10, 2024

INDIA కూటమి బాధ్యతలు.. మమతకు YCP మద్దతు!

image

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్య‌తిరేక స్టాండ్‌కు YCP క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. INDIA కూట‌మి బాధ్య‌త‌ల్ని CM మ‌మ‌తా బెన‌ర్జీకి ఇవ్వాలని మిత్ర‌ప‌క్షాలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. దీనికి గొంతు క‌లుపుతూ కూట‌మిని న‌డిపించ‌డానికి మ‌మ‌త స‌రైన నాయ‌కురాల‌ని YCP MP విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు. పెద్ద రాష్ట్రానికి CM అయిన మ‌మ‌త త‌న‌ను తాను నిరూపించుకున్నారంటూ ఆమెకు మద్దతు పలకడం గమనార్హం.

News December 10, 2024

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ తొల‌గింపు నిబంధ‌న‌లు ఇవే

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌పై విప‌క్షాలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సంద‌ర్భంగా ఆ రోజు స‌భ‌కు హాజ‌రైన‌వారిలో సగం కంటే ఎక్కువ మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. రాజ్య‌స‌భ ఆమోదం అనంత‌రం ఇదే తీర్మానం లోక్‌స‌భలో సాధార‌ణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్ర‌క్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జ‌రుగుతుంది. విప‌క్షాల‌కు బ‌లం లేక‌పోవ‌డంతో రాజ్య‌స‌భ‌లో తీర్మానం నెగ్గే ప‌రిస్థితి లేదు.

News December 10, 2024

చలికాలంలో ఈ జ్యూస్ తాగితే…

image

ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్‌నూ తొలగిస్తుంది.