News April 24, 2024
సర్వేల ప్రకారం BRSకు 8-10 సీట్లు: KTR

ఈ LS ఎన్నికల్లో BRS 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్, BJP ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News February 9, 2026
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రెండోరోజు సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున పట్టువస్త్రాలను పండితులు సమర్పిస్తారు. రాత్రి స్వామి అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ నెల 18 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
News February 9, 2026
ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ షరతులు?

T20 WCలో INDతో మ్యాచ్ ఆడేందుకు ICCకి పాక్ 3 షరతులు పెట్టిందని తెలుస్తోంది. ‘రెవెన్యూలో షేర్ పెంచాలి. ఇండియాతో ద్వైపాక్షిక క్రికెట్‌ను పునరుద్ధరించాలి. హ్యాండ్‌షేక్ ప్రొటోకాల్ కొనసాగించాలి’ అని కోరిందని సమాచారం. ICC, PCB మధ్య భేటీ ముగిసిందని, 24గంటల్లో పాక్ నిర్ణయం తీసుకోనుందని క్రీడావర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే మీటింగ్‌లో తమకు పరిహారం, ఓ ICC ఈవెంట్ నిర్వహణ హక్కులివ్వాలని <<18951531>>BCB<<>> కోరినట్లు చెప్పాయి.
News February 9, 2026
గోండ్ కటిరాతో ఎన్నో లాభాలు

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.


