News June 2, 2024
అమిత్ షాపై ఆరోపణలు.. జైరాం రమేశ్‌కు ఈసీ లేఖ
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై EC స్పందించింది. ఆరోపణలపై తగిన ఆధారాలివ్వాలని ఆదేశించింది. ‘మీరు ఒక జాతీయ పార్టీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం’ అని ఈసీ ఆయనకు రాసిన లేఖలో పేర్కొంది.
Similar News
News September 10, 2024
కొత్త లైన్‌కు అనుమతివ్వండి.. రైల్వే మంత్రికి బండి వినతి
TG: కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయన నివాసంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఉప్పల్ రైల్వేస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. దీంతో పాటు జమ్మికుంటలో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఆగేలా ఆదేశించాలన్నారు. తన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బండి ట్వీట్ చేశారు.
News September 10, 2024
భారత స్టేడియంపై అఫ్గానిస్థాన్ టీమ్ ఆగ్రహం
అఫ్గానిస్థాన్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతుంటుంది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ స్టేడియంలో ఆ జట్టు న్యూజిల్యాండ్‌తో సోమవారం నుంచి టెస్టు ఆడాల్సి ఉంది. వర్షం లేకపోయినా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గ్రౌండ్ చిత్తడిగా ఉండి తొలి రెండ్రోజుల మ్యాచ్ రద్దైంది. దీంతో అఫ్గాన్ జట్టు సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేడియంలో ఇంకెప్పుడూ మ్యాచులు ఆడేది లేదని మండిపడ్డారు.
News September 10, 2024
ట్రంప్ ఓడితే.. అమెరికన్లకు మస్క్ హెచ్చరిక
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోతే అమెరికాకు ఇవే ఆఖరి అసలు సిసలైన ఎన్నికలు అవుతాయని బిలియనీర్ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. కోటిన్నర మంది అక్రమ వలసదారుల్ని సక్రమం చేసేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరింత మందిని తీసుకొచ్చి వారు స్వింగ్ స్టేట్స్ గెలిచి అమెరికాను ఏకపార్టీ రాజ్యంగా మార్చేస్తారని తెలిపారు. 1986 ఆమ్నెస్టీ సంస్కరణలతో కాలిఫోర్నియా ఇలాగే మారిందని గుర్తుచేశారు.