News January 5, 2025
బొండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి కేసు నిందితుడు అరెస్ట్
AP: టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేసిన తురకా కిశోర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కిశోర్ అజ్ఞాతంలో ఉన్నారు. మాచర్ల YCP మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇతడు ప్రధాన అనుచరుడు. 2020లో ఎన్నికల పరిశీలనకు మాచర్లకు వెళ్లిన బొండా ఉమ, వెంకన్నపై తురకా కిశోర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేతల కారు పూర్తిగా ధ్వంసమైంది.
Similar News
News January 24, 2025
సైఫ్‌కు రూ.25 లక్షల బీమాపై జోరుగా చర్చ
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి రూ.25 లక్షల బీమా మంజూరు చేయడం SMలో విస్తృత చర్చకు దారితీసింది. అదే సామాన్యులకైతే ఎన్నో కొర్రీలు పెట్టి, తమ చుట్టూ తిప్పుకున్న తర్వాత ఏదో కొంత ఇస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సామాన్యులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా క్లైమ్ చేయరు. VVIPలకు మాత్రం ఆగమేఘాల మీద బీమా క్లెయిమ్ చేస్తారని మండిపడుతున్నారు.
News January 24, 2025
తలకు ఆనుకొని భారీ కణితి.. కాపాడిన వైద్యులు
ఫొటో చూసి రెండు తలలతో ఉన్న శిశువు అనుకుంటున్నారా? కాదు. ఈ పాపకు తలతో పాటు భారీ కణితి ఏర్పడింది. దీనిని ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే డిసీస్ అని ఓ వైద్యుడు ఈ ఫొటో షేర్ చేశారు. పుట్టుకతోనే మెదడుతో పాటు చుట్టుపక్కల కణజాలం పుర్రె నుంచి బయటకు వస్తాయని తెలిపారు. ఎంతో క్లిష్టమైన చికిత్సను తాము పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయడం వల్ల వీటిని ముందే గుర్తించవచ్చన్నారు.
News January 24, 2025
400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యం!
యూపీ సంభల్‌లోని అల్లీపూర్‌లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.