News August 21, 2024

హత్యాచారానికి ముందు రెడ్‌లైట్ ఏరియాకు నిందితుడు?

image

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్, దారుణానికి ఒడిగట్టే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 8న రాత్రి మద్యం సేవించిన రాయ్, RG కర్‌కు చెందిన మరో వాలంటీర్‌తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. తెల్లవారుజామున ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢనిద్రలో ఉన్న బాధితురాలిని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు.

Similar News

News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.

News September 20, 2024

‘బంగ్లా’ను కుప్పకూల్చారు

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 149 రన్స్‌కే కుప్పకూల్చారు. బుమ్రా 4, ఆకాశ్ దీప్ 2, జడేజా 2, సిరాజ్ 2 చొప్పున వికెట్లు తీశారు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 227 రన్స్ ఆధిక్యంలో ఉంది.