News March 25, 2024
సజ్జలపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

AP: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరారు.
Similar News
News November 14, 2025
రెయిన్బో డైట్ గురించి తెలుసా?

బరువు తగ్గడానికి కొందరు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంకొందరు, కండలు తిరిగిన దేహం కోసం మరికొందరు రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వాటిల్లో ఒకటే రెయిన్బో డైట్. పళ్లెంలో రంగురంగుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనిద్వారా శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయంటున్నారు.
News November 14, 2025
రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News November 14, 2025
‘కాంత’ సినిమా రివ్యూ&రేటింగ్

ఓ దర్శకుడు, హీరోకి మధ్య విభేదాలతో పాటు ఓ హత్య చుట్టూ జరిగే కథే ‘కాంత’. 1950 కాలం నాటి సినీ లోకాన్ని స్క్రీన్‌పై చూపించారు. సెట్స్, కార్లు, కెమెరాలు, లొకేషన్స్, గెటప్‌లు కొంత మేరకు ఆకట్టుకుంటాయి. మహానటి సినిమాను గుర్తుచేస్తాయి. దుల్కర్, సముద్రఖని, రానా నటన మెప్పిస్తుంది. సాగదీతగా సాగే స్క్రీన్‌ప్లే, స్టోరీకి కనెక్ట్ కాకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది. రేటింగ్: 2.5/5.


