News September 5, 2024
130 సినిమాల్లో కలిసి హీరోహీరోయిన్‌గా నటించారు!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరో, హీరోయిన్ కలిసి మూడు, నాలుగు సినిమాలు తీయడమే ఎక్కువ. కానీ ఓ జంట ఏకంగా 130 చిత్రాల్లో కలిసి నటించారనే విషయం మీకు తెలుసా? 1962 – 1981 మధ్యకాలంలో మలయాళ నటీనటులు ప్రేమ్ నజీర్, షీలా 130 చిత్రాల్లో కలిసి నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. సూపర్ హిట్ జోడీగానూ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ నటించిన సినిమాల్లో 50కిపైగా చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
Similar News
News September 12, 2024
హరియాణా అసెంబ్లీ రద్దు
హరియాణా అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉత్తర్వులు జారీ చేశారు. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అదేనెల 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు.
News September 12, 2024
ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది?: అంబటి రాంబాబు
AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో సెటైర్లు వేశారు. ‘ఏలేరు వరదలకీ జగనే, బుడమేరు వరదలకీ జగనే, అచ్యుతాపురం పేలుళ్లకీ జగనే.. ఇలా అన్నింటికీ జగనే అని చెప్పడానికా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది?’ అని ప్రశ్నించారు.
News September 12, 2024
నెగ్గిన ఏచూరి ప్రతిపాదన.. రాజ్యసభలో అరుదైన ఘటన
తనదైన శైలిలో సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించడంలో <<14084560>>సీతారాం ఏచూరి<<>> దిట్ట. సబ్జెక్టుపై సమగ్రమైన అవగాహనతో సభలో ఆయన విలువైన సూచనలు చేసేవారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై ఓటింగ్‌లో ఆయన ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం అరుదు.