News August 26, 2024

పళ్లూడిపోయినా నటిస్తున్నారు: రజనీపై DMK మంత్రి విసుర్లు

image

నటుడు రజనీకాంత్‌పై DMK మంత్రి దురైమురుగన్ పంచ్‌లు విసిరారు. ‘నేనూ అదే చెప్తున్నా. పళ్లు ఊడిపోయి, గెడ్డాలు నెరిసి, చివరి దశకు చేరుకున్నా ఇంకా నటిస్తూనే ఉన్నారు. యువ నటులకు అవకాశాలు దొరకనివ్వడమే లేదు. చెప్పడం ఎవరికైనా ఈజీయే’ అని విమర్శించారు. ‘DMKలో పాత విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్లు తరగతి వీడటం లేదు. దురైమురుగన్‌తో వేగడం కరుణానిధికే కష్టమైంది. స్టాలిన్ సర్ మీకు హ్యాట్సాఫ్’ అని రజనీ అన్నారు.

Similar News

News November 17, 2025

రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. పార్టీల కుదేలు

image

రాజకీయాల్లో అవకాశాల కోసం ఆడబిడ్డల పోరు పొలిటికల్ ఫ్యామిలీలలో చిచ్చు పెడుతోంది. APలో జగన్ సోదరి షర్మిల, TGలో KTR చెల్లెలు కవిత బాటలోనే బిహార్‌లో తేజస్వి సోదరి రోహిణి బంధాలను తెంచుకున్నారు. ఇంటి పోరుతో ఆయా పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికలకు ముందు షర్మిల వేరుకుంపటి పెట్టుకోగా, ఎన్నికల తర్వాత కవిత, రోహిణి తమ బాధను వెళ్లగక్కారు. రానున్న రోజుల్లో ఈ గొడవలకు ముగింపు దొరుకుతుందా? వేచిచూడాల్సిందే.

News November 17, 2025

సౌదీలో ఘోర ప్రమాదం.. 42 మంది మృతి

image

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. ఇందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఫరహత్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది.

News November 17, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* కడప జిల్లాలోని పుష్పగిరిలో 13వ శతాబ్దానికి చెందిన శాసనాలను పురావస్తు శాఖ గుర్తించింది.
* కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన A24 చిన్న అప్పన్నను నేటి నుంచి 5 రోజులపాటు సిట్ విచారించనుంది. ఇదే కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఈ నెల 19/20న విచారణకు హాజరుకానున్నారు.
* TTD మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.