News August 26, 2024
పళ్లూడిపోయినా నటిస్తున్నారు: రజనీపై DMK మంత్రి విసుర్లు
నటుడు రజనీకాంత్‌పై DMK మంత్రి దురైమురుగన్ పంచ్‌లు విసిరారు. ‘నేనూ అదే చెప్తున్నా. పళ్లు ఊడిపోయి, గెడ్డాలు నెరిసి, చివరి దశకు చేరుకున్నా ఇంకా నటిస్తూనే ఉన్నారు. యువ నటులకు అవకాశాలు దొరకనివ్వడమే లేదు. చెప్పడం ఎవరికైనా ఈజీయే’ అని విమర్శించారు. ‘DMKలో పాత విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్లు తరగతి వీడటం లేదు. దురైమురుగన్‌తో వేగడం కరుణానిధికే కష్టమైంది. స్టాలిన్ సర్ మీకు హ్యాట్సాఫ్’ అని రజనీ అన్నారు.
Similar News
News September 13, 2024
హరీశ్ రావుకు వైద్య పరీక్షలు
TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.
News September 13, 2024
BRS నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకు దెబ్బ తీయండి: కోమటిరెడ్డి
TG: BRS పార్టీ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై BRS నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్‌తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.
News September 13, 2024
కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం
TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.