News October 3, 2024
కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కోన వెంకట్
నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దారుణమని సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. ‘నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలి. ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలి. దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 5, 2024
TODAY HEADLINES
➥అత్యాచారాలపై హోం మంత్రి బాధ్యత వహించాలి: పవన్
➥నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి: పవన్ కళ్యాణ్
➥పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు: మంత్రి అనిత
➥ఈ నెల 8న మూసీ నది వెంబడి CM రేవంత్ పాదయాత్ర
➥రేషన్ కార్డు లేనివారికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
➥సర్పంచులకు మార్చిలోపు బకాయిలు చెల్లిస్తాం: పొన్నం
➥ కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడి.. ఖండించిన మోదీ
News November 5, 2024
పవన్ బయటపడ్డారు, మేము పడలేదంతే: అనిత
AP: నేరాల విషయంలో అందరికీ బాధ ఉందని, పవన్ కళ్యాణ్ బయటపడ్డారని, తాము పడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆయన మాటలను బాధ్యతగా తీసుకొని కలిసి పనిచేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ పాలనలో పోలీసులు విధులు నిర్వహించేందుకు ఇబ్బంది పడ్డారని అనిత ఆరోపించారు. గతంలో రాజకీయంగా నేరాలను ప్రోత్సహించారని మండిపడ్డారు.
News November 5, 2024
చనిపోయినా కళ్లు చెదిరే సంపాదన!
లైసెన్స్, స్ట్రీమింగ్ హక్కులు, సేల్స్, ఇతర రూపాల్లో మరణానంతరం రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న ప్రముఖ సెలబ్రిటీల వివరాలను ఫోర్బ్స్ విడుదల చేసింది.
మైకేల్ జాక్సన్(2009 మరణం): 600మి.డాలర్లు, ఫ్రెడ్డీ మెర్క్యురీ(1991):250మి. డా, స్యూస్(1991): 75 మి.డా, ఎల్విస్ ప్రెస్లీ(1977): 50 మి.డా,
రిక్ ఒకాసెక్(2019): 45 మి.డా, ప్రిన్స్(2016):35 మి.డా, బాబ్ మార్లే(1981): 34 మి.డా, చార్లెస్ షుల్జ్(2000): 30 మి.డాలర్లు.