News March 18, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ హరిచందన

image

టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్‌, ప్రింటర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News December 3, 2025

దేవరకొండ: బురఖా ధరించి వృద్ధురాలిపై రోకలితో దాడి

image

దేవరకొండ, గాంధీనగర్‌లో బురఖా ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ఓ మహిళ వృద్ధురాలు కొండోజు భాగ్యమ్మపై రోకలితో దారుణంగా దాడి చేసింది. కోడలి స్నేహితురాలినని చెప్పి లోపలికి వచ్చి క్రూరంగా కొట్టింది. కేకలు విని స్థానికులు రాగా, ఆమె పారిపోయింది. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం ఇంట్లోంచి మాయమైన రోకలితోనే దాడి జరగడం సంచలనం సృష్టించింది.

News December 3, 2025

ఎన్ని నామినేషన్లు వచ్చాయి?ఎన్ని రిజక్ట్ చేశారు?: ఇలా త్రిపాఠి

image

నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ? ఎన్ని రిజక్ట్ చేశారని? అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్‌పై ఆరా తీశారు.

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.