News March 18, 2024
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: కలెక్టర్ హరిచందన
టెలివిజన్ ఛానళ్లు, వార్త పత్రికల్లో ప్రభుత్వ పథకాలపై ప్రకటన నిలిపివేయాలని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలపై పబ్లిషర్, ప్రింటర్ పేరు, ఫోన్ నంబర్‌తో సహా ప్రచురించాలని, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రచురణకర్త ద్వారా డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలో ఉల్లంగిస్తే ప్రజాప్రతినిధ్య చట్టం–1951 కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 11, 2024
నల్గొండ: తెల్లబోతున్న పత్తి రైతులు..!
పత్తికి సరైన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా పెట్టుబడి బారం, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిగా వర్షాలు పడక.. కాలం కలిసి రాక దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆ కొద్ది పాటి పంటను తీసుకుందామంటే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తడిచి చేనులోనే మొలకలు వస్తు న్నాయి. క్వింట పత్తి మొదట రూ.7000 -8000 ఉండగా.. ప్రస్తుతం రూ.5000-6000 కే పరిమితం అయింది.
News October 11, 2024
నల్గొండ: 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులకు టీచర్ ఉద్యోగాలు
డీఎస్సీ -2024 పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తూ డీఎస్సీ-2024కు ఎంపికయ్యారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పారిశుద్ధ్య, నీటి సరఫరా, మొక్కల పెంపకం, ధ్రువీకరణ పత్రాలు, వీధి దీపాల నిర్వహణ చేసేవారు. ఎంపికైన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇకపై విద్యార్థులకు బడిలో పాఠాలు చెప్పనున్నారు.
News October 11, 2024
డీఎస్సీ-2024 కౌన్సిలింగ్‌కు ఆదేశాలు రాలేదు: డీఈఓ బిక్షపతి
డీఎస్సీ-2024 కౌన్సిలింగ్ విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అని డీఈఓ బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ వద్ద రిపోర్టు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు ఉపాధ్యాయుల రిపోర్టింగ్కు కు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దసరాకు ముందు పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దసరా తర్వాతే కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తాం అని పేర్కొన్నారు.