News November 1, 2024

కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే చర్యలు: నిరంజన్

image

TG: కులగణనను రాజకీయం చేయవద్దని BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కోరారు. ‘ఇదొక బృహత్తర కార్యక్రమం. కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. BCల జనాభా తేల్చేందుకు ఈ సర్వే కీలకం. 52% BCలు ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని నిరూపించుకునేందుకు ఇదే అవకాశం. మళ్లీ కులగణన జరుగుతుందో లేదో తెలియదు. కులసంఘాలు దీనిలో కీలకపాత్ర పోషించాలి. ప్రజలూ సహకరించాలి’ అని కోరారు.

Similar News

News November 1, 2024

కులగణన.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు

image

TG: ఈ నెల 6 నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 80వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. 36,559 మంది SGTలతో పాటు 3414 ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్లు సహా మరికొందరిని ఇందుకోసం వినియోగించనుంది. అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే SGTలకు మినహాయింపు ఇచ్చింది. ప్రైమరీ స్కూళ్లల్లో ఈ 3 వారాల పాటు ఉదయం 9 నుంచి మ.ఒంటి గంట వరకే క్లాసులు జరుగుతాయి.

News November 1, 2024

వేడి నూనె పాత్ర‌లో ప‌డ్డ ఫోన్.. బ్యాట‌రీ పేలి వ్య‌క్తి మృతి

image

వంట చేస్తూ చేతిలో ప‌ట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న స‌మ‌యంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్ర‌లో ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా బ్యాట‌రీ పేల‌డంతో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియ‌ర్ త‌ర‌లిస్తుండ‌గా సింధ్ న‌దిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.

News November 1, 2024

టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు

image

AP: బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.