News December 26, 2024
పెళ్లంటే భయం.. రొమాన్స్ అంటే ఇష్టం: శృతి హాసన్
తన వివాహం గురించి హీరోయిన్ శృతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో వివాహం చేసుకుంటారని వార్తలు రాగా దీనిని ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ సూచించారు. ‘నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ రిలేషన్‌లో ఉండేందుకు ఇష్టపడతా. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నన్ను నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News January 16, 2025
IND క్రికెటర్లు, కోచ్‌పై కఠిన ఆంక్షల వెనుక..
క్రికెటర్లపై BCCI <<15152483>>కఠిన ఆంక్షల<<>> వెనుక తీవ్ర కారణాలున్నట్లు TOI వెల్లడించింది. ‘AUS టూర్‌లో ప్లేయర్లు గ్రూపులుగా ట్రావెల్ చేశారు. దీంతో జట్టు బాండింగ్ మిస్సయ్యింది. ఆ మొత్తం పర్యటనలో ఒకేసారి టీమ్ డిన్నర్ జరిగింది. పలువురు తమ కుటుంబాలతో హోటళ్లలో స్టే చేస్తున్నారు. ఆఖరికి కోచ్ గంభీర్ కూడా క్రికెటర్లతో కాకుండా తన సొంత మనుషులతో బయటకు వెళ్లారు. దీంతోనే BCCI ఈ చర్యలకు దిగింది’ అని పేర్కొంది.
News January 16, 2025
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం ఛైర్మన్‌ను నియమించనుంది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 JAN 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. అటు స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు పలు పథకాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.3,985 కోట్లతో మూడో స్పేస్ లాంచ్ ప్యాడ్‌ను ఏర్పాటు చేయనుంది.
News January 16, 2025
2 నెలల్లో ఉచిత బస్సు పథకం: మంత్రి మండిపల్లి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో AP దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. తిరుపతి(D)లోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.